రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వానాకాలం వేరుశెనగ పంట సాగు చేసే రైతులు విత్తే ముందు తప్పనిసరిగా లోతు దుక్కులు చేసుకోవాలి. వేసవిలో కురిసే అడపదడపా కురిసే వర్షాలను వినియోగించుకుని లోతు దుక్కులు చేసుకోవాలి. దీని వలన నేలలో దాగి ఉన్న వివిధ రకాల పురుగుల కోశస్థ దశలు కలుపు మొక్కల విత్తనములు తెగుళ్లను కలిగించే శిలీంద్ర బీజాలు ఎండకు నిర్వీర్యం అవుతాయి ఈ లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు భూమి లోకి భాగా ఇంకుతుంది. ఈ దుక్కులను వాలుకు అడ్డంగా చేసుకుంటే భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. అందువల్ల రైతులు తప్పని సరిగా వేసవి దుక్కులు చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.