పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: పశువులలో కాలిపుండు వ్యాధి లక్షణాలు మరియు నివారణ: వర్షాకాలం నేల చిత్తడిగా ఉండటం వలన నేలల్లో ఫ్యూజో బాక్టీరియం నేక్రోపోరం అనే బాక్టీరియా వృద్ది చెందుతుంది, జీవాలు బురదలో నడవడం వలన గిట్టల మధ్య చర్మం మెత్తబడి బాక్టీరియా వలన క్రమంగా పుండ్లు ఏర్పడి వాచి, చిట్లిపోయి చీము పడుతాయి. దీని వలన జీవాలు ముందుకాళ్లపై గెంతుతుంటాయి. ఈ వ్యాధి సోకినపుడు పొటాషియం పర్మాOగనేట్ పొడిని నీళ్ళలో కలిపి ఆ నీటితో కాళ్ల గిట్టలను పూర్తిగా శుభ్రం చేయాలి. యాంటీబయోటిక్ మరియు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లను వరుసగా 3 నుండి 5 రోజుల పాటు వాడితే ఉపశమనం కలుగుతుంది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||