పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: గాలి కుంటూ వ్యాధి లక్షణాలు: గాలి కుంటూ వ్యాధి సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత 104 నుండి 106 డీగ్రీల ఫారన్ హీట్ వరకు ఉంటుంది. నోటిలో చర్మపు పొరలు, పళ్ల చిగుళ్ళు, నాలుక, తోక వద్ద లోపలి ప్రాంతంలో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటలలో చితికి పోవడం వలన పశువులు నొప్పితో మేత తినవు. నోటితో విపరీతంగా నురగ కారుస్తూ ఉంటాయి. గిట్టల మధ్య, గిట్టలపైన వలయంగా ఉండే ప్రాంతంలో బొబ్బలు ఏర్పడి చిటికి నొప్పి వల్ల నడవలేక కుంటుంతుంటాయి. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే మీ దగ్గర్లోని పశు వైద్యుడిని సంప్రదించాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||