పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: వర్షాకాలంలో గొర్రెలకు సోకే వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. మందలోని గొర్రెలకు ఉష్ణోగ్రత 104 నుండి 107 డీగ్రీల ఫారెన్ హీట్ జ్వరం వచ్చి ఐదు రోజుల పై బడి ఉంటుంది. జ్వరం వచ్చిన 48 గంటల తరువాత నోటి నుండి చొంగ కారడం, నోరు మొత్తం ఎర్రగా మారిపోవడం, చొంగ నురగలా మారి పెదవులు, చిగుళ్ళు, పై దవడ, నాలుక వాచిపోతాయి. నాలుక ఇరువైపులా పుండ్లు ఏర్పడి జీవాలు మేత తినేందుకు ఇబ్బంది పడుతాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా వ్యాపిస్తుంది. గిట్టల ముందు భాగం ఎర్రగా కందిపోయి, వాచి, చీము పడుతుంది. దీంతో జీవాలు నడవలేక కుంటుతాయి. మేత తినలేక జీవాలు నిరసించి బరువును కోల్పోతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే మీ దగ్గర్లోని పశు వైద్యుడిని సంప్రదించాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||