గొర్రెలలో నీలి నాలుక వ్యాధి నివారణ చికిత్స

పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: గొర్రెలలో నీలి నాలుక వ్యాధి నివారణ చికిత్స: పొటాషియం పర్మాంగనేట్ ఒక శాతం ద్రావణంతో నోటి పుండ్లను కడిగి శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి , బోరో గ్లిసరిన్ అయింట్మెంట్ రాయాలి . గిట్టల చుట్టూ ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్ లెంట్ ( వేపనూనె ) వంటి ఆయింట్మెంట్స్ పూయాలి . పెన్సిలిన్, ఎన్రోఫ్లోఆక్సిన్ వంటి ఉపశమనం కలిగించే యాంటీబయోటిక్ మందులను నోటి ద్వారా లేదా ఇంజక్షన్ రూపంలో వారం రోజుల పాటు ఇవ్వాలి . వ్యాధి నిరోధకత కోసం విటమిన్ - సి ఇంజక్షన్ ను వాడాలి. ఇది పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. వ్యాధి సోకిన జీవాన్ని మంద నుంచి తప్పనిసరిగా వేరు చేయాలి . లేదంటే ఆ జీవాన్ని కుట్టిన దోమ మిగిలిన జీవాలను కుడితే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే మీ దగ్గర్లోని పశు వైద్యుడిని సంప్రదించాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags