వరిలో జింక్ లోప నివారణ 
 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరిలో జింక్ లోపం నారు మడిలో లేదా నాటిన 2 నుండి 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనేకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనపడతాయి. ఆకులు చిన్నవిగా, పేలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి.మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై పిచికారి చేసే రైతులు జింక్ సల్ఫెట్ 2 గ్రా లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags