రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రధాన పోలంలో కాండం తొలుచు పురుగు నివారణకు గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది. గనుక నారు నాటే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడా నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు లేదా 600 గ్రా ఫిప్రోనీల్ 3 జి గుళికలు నారు మడిలో వేసుకోవాలి. ఒక వేళ నారు మడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న పిలక దశలో ఉన్న వరి పైరులో ఈ యాసంగికి తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు 10 కిలోలు లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 జి 4 కిలోలు వేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||