రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ మరియు వాతావరణ సమాచారం: భారత వాతావరణ శాఖ వారి గణాంకాల ప్రకారం జిల్లాలో రానున్న 2 రోజులు ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. జిల్లాలో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తమ పొలాల్లో మురుగు నీరు పొలం నుండి బయటకు పోయేందుకు వీలుగా పంట కాలువలను ఏర్పాటుచేసుకోవాలి. ఒకవేళ పొలంలో వర్షపు నీరు నిలిస్తే వెంటనే తీసివెయ్యాలి. వర్షాలు తగ్గిన తరువాత కాస్త ఎండగా ఉన్న సమయంలో 10 గ్రా. 19:19:19 (లేదా) పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పిచికారీ చేసినట్లయిట్లతే నీటిముంపునకు గురైనమొక్కలు పోషకాలను సమర్థవంతంగా తీసుకోలేవు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.